గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై రేపటి చలోహైదరాబాద్
కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
రాష్ట్ర సిఐటియు పిలుపు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు రేపటి చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందస్తుగా గ్రామపంచాయతీ కార్మికులు, ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో , కొన్ని నెలల నుంచి పెండింగ్ వేతనాలు, కనీస వేతనం 18000 అమలు చేయాలని, అలాగే జీవో 51 సవరించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరీల వారీగా పని విభజన చేయాలని కోరుతూ గత కొంత కాలం నుంచి గత ప్రభుత్వాల నుంచి కూడా గ్రామపంచాయతీ కార్మికులు ఎన్నో సందర్భాలలో ధర్నాలు, వినతి పత్రాలు ఇచ్చిన కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న తీరును గ్రామపంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ జిల్లాలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు రేపు పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సిఐటియు పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో అక్కనపెల్లి లక్ష్మణ్, సంతపురి సుమన్, సుమతి, ర్యకము మల్లేశం, శ్రీధర్, బాబు తదితరులు పాల్గొన్నారు.