మహాశక్తి ఆలయంలో చండీ హోమం

*శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా చండీ హోమం*

*అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు*

*చండీ హోమ విశిష్టతను భక్తులకు హితోపదేశం చేసిన వేద పండితులు*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 26*

కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాదుర్గా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రావణ బహుళ అష్టమి పురస్కరించుకొని సోమవారం రోజున చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి దివ్య ఆశీస్సులతో వేద పండితులు చండీ హోమాన్ని చేపట్టారు చండీహోమ కార్యక్రమానికి అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్త జనాన్ని ఉద్దేశించి వేద పండితులు హితోపదేశం చేశారు మార్కండేయ పురాణంలోని 13వ అధ్యాయాలలో 700 మంత్రాలతో కూడిన చండి సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమమన్నారు చండీ హోమం అనేది ఒక ప్రముఖ ప్రత్యేక హోమం అని అన్ని కార్యక్రమాలలో విజయం పొందడానికి జీవితంలోని అన్ని రకాల దోషాలు అడ్డంకులను తొలగించడానికి చండీ హోమం శక్తివంతమైందన్నారు హోమం వల్ల ప్రతికూల శక్తులన్నీ దూరమవుతాయన్నారు చండీరూపంలో ఉన్న మహాదుర్గ ఈ హోమం యొక్క ప్రధాన దేవత అని తెలిపారు ముఖ్యంగా అమ్మ ఆశీర్వాదాలు విజయానికి కీర్తికి దోహదపడడమే దీర్ఘకాల ఆరోగ్యానికే కాకుండా జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తుందన్నారు అలాగే చండీ పారాయణ వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఎక్కడ చండి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదని లోక కళ్యాణం సర్వజనులహితం కోసం పరబ్రహ్మస్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులు పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోందని కలియుగంలో చండీ పారాయణ నిర్మించిన శక్తి ఫల సాధనం మరొకటి లేదని ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమమైందన్నారు ప్రతి నెల బహుళ అష్టమి తిథి రోజున దేవాలయంలో చండీ హోమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు

Join WhatsApp

Join Now