కన్నుల పండుగగా చంద్ర రథోత్సవ శోభాయాత్ర
చంద్ర
శ్రీరామనామస్మరణతో మారు మ్రోగిన ఆలయ ప్రాంగణం
ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం
భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత ప్రధాన ఘట్టమైన చంద్ర రథోత్సవం పైన కోదండ రాముడు కొలువదీరాడు శ్రీరామ నామస్మరణతో ఇల్లందకుంట ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది ఆదివారం రాత్రి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి వేద మంత్రచరణల మధ్య ప్రతిష్టించారు మధ్య రాత్రి నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లో గంటల తరబడి నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హుజురాబాద్ జడ్జి పద్మ సాయి ఎంపీ ఈటెల రాజేందర్ సీతారామచంద్రస్వామి దర్శించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భక్తులకు పదివేల మజ్జిగ ప్యాకెట్లను పంపించగా ఇల్లందకుంట బిజెపి అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. భక్తుల కోసం ఆలయ సిబ్బంది మంచినీటి సౌకర్యం క్యూలైన్లు చలవ పందిళ్లను భారీకెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసిపి శ్రీనివాస్ జి ఆదేశానుసారం రూరల్ సీఐ కిషోర్ ఎస్ఐలు రాజకుమార్, తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో పార్కింగ్, క్యూలైన్ లో వచ్చేలా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తును నిర్వహించారు. సాయంత్రం5 గంటలకు ఉత్సవమూర్తులను వేలాది మంది భక్తజనం జయ జయ ధ్వనుల మధ్య మాడ వీధుల గుండా స్వామి వారి రథాన్ని ఆలయం ముందుకు శ్రీరామ నామస్మరణతో జైశ్రీరామ్ అంటూ లాగారు. సాయంత్రం ఏడు గంటలకు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామారావు ఆలయ ధర్మకర్తలు ఆలయ కార్యనిర్మాణ అధికారి కందుల సుధాకర్ అర్చకులు వంశీధర్ఆచార్యులు రవికుమార్ సీతారామాచార్యులు ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.