6 గంటల తర్వాత వెళ్లిపోండి-ఉద్యోగులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్న, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులకు చంద్రబాబు చెప్పిన న్యూస్ కచ్చితంగా శుభవార్త కాబోతోంది.
రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసు వదిలి ఇళ్లకు వెళ్లిపోవాలని సీఎం చంద్రబాబు ఇవాళ సలహా ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని వారికి తెలిపారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తుచేశారు.
ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపరు