ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈసందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900కోట్లపెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకుప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది..