ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి: జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజరాణిలకు ఫిర్యాదులను సమర్పించారు. కాగా రెవిన్యూ -15, పౌరసరఫరాల శాఖ 09, పంచాయత్ రాజ్ 09, డిఆర్ డిఓ 09, వివిధ శాఖలకు సంబంధించి 12, మొత్తంగా 54 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ పద్మజరాణి, జడ్పి సిఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now