సోషలిస్టు వ్యవస్థనే ప్రత్యామ్నాయం సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

*సోషలిస్టు వ్యవస్థనే ప్రత్యామ్నాయం సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్*

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

పెట్టుబడుదారి వ్యవస్థకు సోషలిజమే ప్రత్యాన్మాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కందురి చంద్రశేఖర్ అన్నారు 176 ఏళ్ల క్రితం వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక నేటికీ అనుసరణీయమని అన్నారు

పార్టీ జిల్లా కార్యాలయంలో రెడ్బుక్ డే ను నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ రాజకీయ ముసాయిదాను సామూహిక పఠనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అసమానతలు సహజంగానే పెరుగుతున్నాయని పేర్కొన్నారు 2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుత ప్రపంచ సంక్షోభంగా మారిందని వివరించారు నిరుద్యోగం పేదరికం పెరిగిందని మరోపక్క కొంతమంది కార్పోరేట్ శక్తులు పెట్టుబడిదారుల దగ్గర సంపద పోగుపడుతోందని చెప్పారు మనదేశంలో నేటికీ 85 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని మరోపక్క ప్రపంచ కుబేరుల్లో అదాని అంబానీ లాంటి వారు చేరుతున్నారని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు దీనికి కారణమని స్పష్టం చేశారు

సోషలిజం మాత్రమే ఆర్థిక అంతరాలు లేని సమాజాన్ని సృష్టిస్తుందని కమ్యూనిస్టు ప్రణాళిక పేర్కొందని ఇది అందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు సోషలిజం సాధించడం కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతి రామ్ నాయక్ కొత్త నర్సింలు ముధం అరుణ్ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment