నస్రుల్లాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడిగా చందూరి హన్మాండ్లు నియామకం
ప్రశ్న ఆయుధం 03 మే(బాన్సువాడ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రకీయాలో భాగంగా నసురుల్లాబాద్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు నన్ను నియమించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షలు ఎండల లక్ష్మి నారాయణ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ విజయం కోసం పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.