తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు

*తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు*

తిరుమల :

శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు

తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమలు

తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద.. మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీచేస్తోంది. వీటిని శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లల్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్కార్డుతోపాటు దర్శన టికెట్టును తప్పనిసరి చేసింది.

గతంలో వీఐపీ గదులను ఆధార్తో దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండటంతో దర్శన అనంతరం ఖాళీచేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంట లోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది.

Join WhatsApp

Join Now