భద్రాచలం దేవస్థానంలోని ప్రసాదాల కౌంటర్ విభాగంలో పని చేసే పలువురు సిబ్బంది విధుల్లో మార్పు చేస్తూ దేవస్థానం ఈవో రమాదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన ఆలయం టికెట్ కౌంటర్లో పని చేస్తున్న రికార్డు అసిస్టెంట్ చంటికుమార్ ను ప్రసాదాల కౌంటరు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ప్రసాదాల కౌంటర్లో పని చేసే సతీష్ కు అదే విభాగంలో రిలీవర్ గా బాధ్యతలు అప్పగించారు.