నర్వ’’ మండల రూపురేఖలు మార్చండి..:బండి సంజయ్

*‘‘నర్వ’’ మండల రూపురేఖలు మార్చండి*

*పీహెచ్ సీలో తక్షణమే డాక్టర్ ను నియమించండి*

*ఫర్నీచర్ అందించండి*

*స్కూళ్లో మిడ్ డే మీల్ వంట పాత్రలు సమకూర్చండి*

*నారాయణపేట జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*

*ఎంపీ డీకే అరుణతో కలిసి నర్వ మండల కేంద్రంలో పర్యటన*

*బ్రహ్మరథం పట్టిన ప్రజలు…*

*నారాయణపేట కలెక్టర్ తో కేంద్ర మంత్రి భేటీ*

సమగ్రత అభియాన్ లో భాగంగా ఎంపికైన ఆకాంక్షిత మండల కేంద్రం నర్వాను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నారాయణపేట జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అందులో భాగంగా నర్వా మండల కేంద్రంలోని రోడ్లును అభివ్రుద్ధి చేయడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని కోరారు. దీంతోపాటు పీహెచ్ సీలో ఫర్నీచర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి నారాయణపేట జిల్లా నర్వా మండల కేంద్రంలో పర్యటించారు. నర్వ మండలాన్ని కేంద్రం ఆస్ప్రిరేషన్ బ్లాక్(ఆకాంక్షిత మండలం) గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నర్వ మండల కేంద్రంలోకి రాగానే వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లి నీరాజనం పలికారు. వేలాది మంది వెంటరాగా వారితో కలిసి మండలం కేంద్రంలోని అంగన్ వాడీ సెంటర్ ను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రంలోని గర్భీణీలకు సీమంతం సందర్భంగా వారికి పండ్లను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం అంగన్ వాడీ కేంద్రంలో మొక్కను నాటారు.

అక్కడి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన బండి సంజయ్ అక్కడ డాక్టర్ లేరని ప్రజలు చెప్పడంతో… తక్షణమే రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని ఆదేశించారు. పీహెచ్ సీలో కనీసం ఫర్నీచర్ కూడా లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు విన్నవించడంతో వెంటనే ఫర్నీచర్ ను సమకూర్చాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం బయటకు వచ్చిన సంజయ్ ను స్థానిక ప్రజలు కలిసి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం లేదని మొరపెట్టుకున్నారు. అక్కడి నుండి స్థానిక పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. భోజనం ఎలా ఉందని అడిగారు. మధ్యాహ్నం భోజనం వండేందుకు వంట పాత్రలు లేవని నిర్వాహకులు చెప్పడంతో… వెంటనే వాటిని సమకూర్చాలని కలెక్టర్ ను కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సూచించారు.

అనంతరం డీకే అరుణతో కలిసి బండి సంజయ్ నేరుగా నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కు విచ్చేశారు. కలెక్టర్ స్నిగ్ధ తో భేటీ అయ్యారు. ఆస్పిరేషనల్ బ్లాక్ గా నర్వ ఎంపికనైందున మండల కేంద్రం రూపురేఖలు మార్చాల్సిందేనని కోరారు. ‘‘ముఖ్యంగా గత 3 నెలల్లో యాంటినేటల్ కేర్ (ANC) కోసం ఎంత మంది గర్భిణీ(ప్రెగ్నెంట్స్) లను రిజిస్టర్ చేశారు? ఏయే గ్రామాలకు వెళ్లారు? ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత మంది పేర్లను రిజిస్టర్ చేశారు? 2024 ఫస్ట్ త్రైమాసికంలో స్టేట్ యావరేజ్ (88.7 శాతం) ఉంటే ఈ మండలంలో 77.1 శాతం మాత్రమే నమోదైంది. కారణాలేమిటి?’’అనే అంశంపై ఆరా తీశారు.

దీంతోపాటు ‘‘ బీసీ, షుగర్ టెస్టుల్లో, పోషకాహారం అందించడంలో, మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించడంలో కూడా 3 నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపుతున్నారు. ఎట్లా సాధ్యమైంది? మీరు తీసుకున్న చర్యలేమిటి? అట్లాగే భూసార పరీక్షల శాంపిల్స్ తీసుకోలేదని మీ రిపోర్ట్ లో ఇచ్చారు. కొన్ని బ్లాకుల్లో శాంపిల్స్ తీసుకున్నారు కదా? మీరెందుకు సేకరించలేకపోయారు?’’ అనే అంశంపై అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు.అనంతరంర ‘‘సమగ్రతా అభియాన్’’ కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఉద్దేశించి నర్వ మండల కేంద్రంలో ప్రజలు తనతో మొరపెట్టుకున్న సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు. వచ్చే ఏడాదిలో మార్చి లేదా ఏప్రిల్ లో మళ్లీ నర్వాకు విచ్చేస్తానని, ఆలోపు రోడ్డు నిర్మాణంతోపాటు కనీస సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పారు.

అంతకుముందు బండి సంజయ్ నర్వా మండల కేంద్రంలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్…సబ్ కా విశ్వాస్…’’. నినాదంలో భాగంగా ‘నీతి అయోగ్’ చేపట్టిన కార్యక్రమమే ఈ ‘‘సంపూర్ణతా అభియాన్’’అని వివరించారు. దేశంలో ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలున్నాయో, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ ‘సంపూర్ణతా అభియాన్’అని పేర్కొన్నారు. ‘‘2018లో మొదటి సారిగా దేశవ్యాప్తంగా 112 ఆస్పిరేషన్ (ఆకాంక్షిత) జిల్లాలను గుర్తించినం. ఈ కార్యక్రమాన్ని మరింతగా క్షేత్ర స్థాయి వరకు విస్తరించాలనే లక్ష్యంతో 2023 జనవరి 7న 500 బ్లాక్/ మండలాలను గుర్తించినం. మన రాష్ట్రంలో 3 జిల్లాలను ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా’’, 10 మండలాలను ‘ఆస్పిరేషనల్ బ్లాక్’లుగా గుర్తించి కార్యక్రమాలను ప్రారంభించినం. ఈ జిల్లాలో ఎంపికైన నర్వా మండలంలో కార్యక్రమాల ప్రోగ్రెస్ ఎట్లా ఉందో తెలుసుకుని రావాలని మోదీజీ ఆదేశించడంతో ఇక్కడికి వచ్చిన. ప్రజలతో మాట్లాడిన. సమస్యలను అడిగి తెలుసుకున్న. అంగన్ వాడీ, పీహెచ్ సీ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన. అక్కడున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. అంతిమంగా నర్వ మండలాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసేందుకు తనవంతు క్రుషి చేస్తా.’’అని వివరించారు.

Join WhatsApp

Join Now