మెదక్/నర్సాపూర్, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎఫ్ సీఐ జనరల్ మేనేజర్ చత్రు నాయక్ జమ్ము కాశ్మీర్ (లదక్) కు బదిలీపై వెళ్లారు. శత్రు నాయక్ ఎఫ్ సీఐ జనరల్ మేనేజర్ మహారాష్ట్రలో పని చేసి జమ్ము కాశ్మీర్ (లదక్)కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎఫ్ సీఐ జనరల్ మేనేజర్ చత్రు నాయక్ జమ్ము కాశ్మీర్ (లదక్)లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం అక్కడ అధికారులు చత్రు నాయక్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మహ్మదాబాద్ లో చత్రు నాయక్ గిరిజన కుటుంబంలో జన్మించి, ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా చత్రు నాయక్ బదిలీపై జమ్ము కాశ్మీర్ (లదక్)కు వెళ్లడంతో ఆయన స్నేహితులు జి.సతీష్ కుమార్, జి. వేణుగోపాల్, ఎన్. మురళి, వెంకటరమణ, ఇ. శ్రీనివాస్, రవీందర్ సిద్దుల తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.