చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్…!!

*_చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్…!!_*

చౌదరిపల్లి ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ . నలుగురు సభ్యులతో రెవెన్యూ కమిటీ ఏర్పాటు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని నిర్ణయించిన కలెక్టర్‌ మనుచౌదరి .

ఈ గ్రామంలో సర్వే నంబర్‌ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్. భూ వివాదం, దాని స్వభావాన్ని నిర్థారించటం కోసం నలుగురు సభ్యులతో కూడిన రెవెన్యూ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న కలెక్టర్‌ మనుచౌదరి

Join WhatsApp

Join Now