నీటి వృధాను అరికట్టాలి- చెక్ డాం మరమ్మతులు చేపట్టాలి
కాంగ్రెస్ యూత్ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్
జమ్మికుంట/వీణవంక ప్రశ్న ఆయుధం జూలై 25
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని లసుమ్మక్కపల్లి చెక్ డాం కు వెంటనే మరమ్మతులు చేపట్టాలి కాంగ్రెస్ యూత్ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ కోరారు వీణవంక రైతుల సంక్షేమం కోసం సాగు నీటిని వృధా చేయవద్దని గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్ల పైచిలుకు నిధులతో వీణవంక వాగుపై లసుమ్మక్కపల్లి గ్రామం వద్ద చెక్ డ్యామ్ ను నిర్మించారని చెక్ డాం కట్టకు గండిపడి గత సంవత్సర కాలంగా నీరు వృధాగా పోవడం జరుగుతుందని నీరు వృధాగా పోవడంతో పాటు వరదకు 5 ఎకరాల సాగు భూమి కొట్టుకుపోయిందని చెక్ డాం కట్టిన కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించి మరమ్మతులకు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు