Site icon PRASHNA AYUDHAM

గుమ్మడిదలలో కోతుల బెడదకు చెక్

IMG 20251231 074402

Oplus_16908288

*సొంత నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు.*

*సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి*

*హర్షం వ్యక్తం చేసిన మహిళలు గ్రామస్తులు*

సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడదకు చెక్ పడింది. సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తన సొంత నిధులతో కోతులను పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కోతుల సమస్య తీవ్రంగా మారింది. మహిళలు, వృద్ధులు, పిల్లలు రోడ్లపై నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇళ్లపైకి కోతులు ఎక్కడం, వస్తువులు పాడుచేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన పలువురు మహిళలు సిజిఆర్‌ను కలిసి సమస్యను వివరించి పరిష్కారం కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన గోవర్ధన్ రెడ్డి సిజిఆర్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో కోతులు పట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద కోతులను పట్టించి, సురక్షితమైన అడవి ప్రాంతంలో విడిచిపెట్టే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలకు అడవి ప్రాంతం సమీపంలో ఉండడం వల్లే ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతుందని, ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిజిఆర్ సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, రాజశేఖర్, కొండల్ రెడ్డి, మొగులయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, వాసుదేవ రెడ్డి, సూర్యనారాయణ, జయపాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్,నర్సింలు, ఏ. కృష్ణ, చంద్రారెడ్డి, నరసింహారెడ్డి, బిక్షపతి, షాదుల్లా, బాబు, మురళి, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version