మొక్కజొన్నలో కలుపుకు చెక్… ‘అషిటాక’తో పంట బంగారం..!

మొక్కజొన్నలో కలుపుకు చెక్… ‘అషిటాక’తో పంట బంగారం..!

ప్రశ్న ఆయుధం సదాశివనగర్, ఆగస్టు 10: మొక్కజొన్న పంటలో కలుపు సమస్యకు ఇక చెక్. గోద్రెజ్ అగ్రోటెక్ ఆధ్వర్యంలో జపాన్ టెక్నాలజీతో రూపొందిన కొత్త కలుపు నివారణ మందు ‘అషిటాక’ రైతుల ముందుకు వచ్చింది.మొక్కజొన్నలో 2–4 ఆకుల దశలో వాడితే కలుపు ముప్పు పూర్తిగా నివారణభూమికి, పంటకు, మానవాళికి ఎటువంటి హానీ లేదుజపాన్ ఐ ఎస్ కె కంపెనీ సాంకేతిక సహకారంతో తయారీ ఉత్తర తెలంగాణ రైతులకు మరింత లాభదాయకం పంట దిగుబడికి బలమైన బలపందిరిఆదివారం మండలంలోని అశోక్ గార్డెన్‌లో వందలాది మంది రైతుల సమక్షంలో గోద్రెజ్ అగ్రోటెక్ సీఈవో ఎస్.కె రాజవేలు చేతుల మీదుగా ‘అషిటాక’ ఆవిష్కరించారు .సీఈఓ రాజవేలు మాట్లాడుతూ – “ఉత్తర తెలంగాణలో మొక్కజొన్న సాగు ఎక్కువ. ఈ కొత్త మందు వాడితే కలుపు పంటను పూర్తిగా నాశనం చేస్తుంది. భూమి సారాన్ని కాపాడుతూ, పంటకు హాని లేకుండా పండిస్తుంది. సరైన మోతాదులో వాడితే అధిక దిగుబడులు రావడం ఖాయం” అని వివరించారు.జపాన్ ఐ ఎస్ కె కంపెనీ ప్రతినిధులు మికియ హోరి, నిమోటో సిమ్, హీరో తోషి మాట్లాడుతూ – “ఈ మందు పర్యావరణానికి మిత్రం. రైతు లాభం కోసం మాత్రమే డిజైన్ చేశాం” అని చెప్పారు.ఈ కార్యక్రమంలో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు నరసింహారెడ్డి, శిరీష,గణేష్,సత్యనారాయణ, కాట్యాడ శ్రీకాంత్ రావు, డీలర్లు పాత ప్రసాద్, పార్శి శ్రీనివాస్, చందు, కృష్ణ, భాగ్యలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment