శ్రీలంకలో ఎర్రజెండా గెలుపుపై హర్షం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి.

గజ్వేల్ సెప్టెంబర్ 23 ప్రశ్న ఆయుధం :

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించడం పై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి హర్షం వ్యక్తం చేసినారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ
కార్మిక కుటుంబంలో జన్మించిన ఆయన విద్యార్థి నేతగా మొదలై గత ఎన్నికలలో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన అతను చేసిన అవినీతిపై, పేద ప్రజల ప్రక్షాన చేసిన పోరాటాల కృషి ఫలితంగానే విజయం సాధించారని అన్నారు. అధ్యక్ష ఎన్నికలలో నిర్ణయాత్మకంగా ఓటు వేసి ఎర్ర జెండాను గెలిపించిన శ్రీలంక ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. శ్రీలంక చరిత్రలో తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ అభ్యర్థి విజయం సాధించడం భవిష్యత్ పోరాటాలకు దిక్సూచి అని అన్నారు శ్రీలంక దేశాన్ని సామాజిక,ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తారని విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.

Join WhatsApp

Join Now