చిరుత సంచారం కలకలం 

చిరుత సంచారం కలకలం

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 02

 

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల పరిధిలోగల బిడ్డగుట్ట వద్ద కే కే వై ప్రధాన రహదారి ప్రక్కన చిరుత పులి సంచరిస్తున్న సంఘటనను ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల దృష్టిలో పడగా చిరుత కదలికలను వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం మేంగారం గ్రామ ప్రాంతంలో చిరుత పులి ఎల్లారెడ్డి_కామారెడ్డి ప్రధాన రహదారిని దాటుతున్న ఫోటోలను తీయడంతో అవి కూడా వైరల్ గా మారాయి. ఈ చిరుత పులి సంచారంతో మేంగారం గ్రామం తోపాటు లింగంపేట అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో గురవుతున్నారని సమాచారం. అలాగే రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ఎల్లారెడ్డి-లింగంపేట భయానాక పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment