కరెంటు షాక్ కు చిరుత బలి
-గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టారు
-అడవి జంతువుల కు రక్షణ కరువు
-అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఆ చిరుత కు శాపం…
-పాతి పెట్టిన చిరుతను వెలికి తీయడానికి కాపలా ఉన్న అటవీశాఖ అధికారులు
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 28, ఎల్లారెడ్డి
అడవి జంతువులకు రక్షణ కరువైందన్న మాట వాస్తవం. జనారణ్యంలోకి రావడం ప్రాణాలు కోల్పోవడం సాధారణమైపోయింది. రైతులు పంట పొలాల వద్ద పంట రక్షణకై విద్యుత్ షాక్ పెట్టడం, వాటికి అడవి జంతువులు పడడం మాములుగానే జరుగుతుంది. కానీ అటవీ శాఖ అధికారుల ప్రజలకు అవగాహన కల్పించడంలో మాత్రం ఇప్పటికీ వెనుకంజలో ఉన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ తండా గ్రామంలో రైతు నుద్ద్య నాయక్ కట్టకింది తండాకు చెందిన వ్యక్తి. చెరుకు తోటకు పెట్టిన విద్యుత్ వైర్లు తగిలి
విద్యుత్ షాక్ తో చిరుత మృతి చెందింది. చిరుత విద్యుత్ షాక్ తో చనిపోవడంతో
విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు కప్పివేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్థానికంగా ఉండక తమ ఇష్టం వచ్చిన సమయానికి కార్యాలయంకు వచ్చి హాజీరు పట్టికలొ తమ దినసరి హాజరు వేసుకొని హాయిగా ఇంటికి వెళ్తున్నారని ప్రజలు మండి పడుతున్నారు. కనీసం అటవిని ఆనుకొని ఉన్న గ్రామాలలోకి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశిలించకపోవడం చిరుత చావుకి కారణమని ప్రజలు అటవీ శాఖ అధికారుల పై మండి పడుతున్నారు. రేంజ్ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మరణానికి కారణం అని గ్రామ ప్రజలు కస్సు, బుస్సు మంటున్నారు. ఇప్పటికైనా ఎల్లారెడ్డి రేంజ్ అటవీ శాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత శాఖ అధికారులను వేడుకుంటున్నారు.