Headlines
-
తెలంగాణ పత్తి రైతుల రాష్ట్ర కో కన్వీనర్ గా చెల్పూరి రాము
-
పత్తి క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర కోరుతున్న రైతులు
-
రైతు రుణమాఫీ, భరోసా అమలుపై చెల్పూరి రాము స్పష్టమైన హామీ
-
రైతుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని పత్తి రైతుల సదస్సులో స్పష్టం
-
తేమ శాతం పేరుతో ఇబ్బందులు వద్దని పత్తి రైతుల డిమాండ్
*జమ్మికుంట నవంబర్ 26 ప్రశ్న ఆయుధం::-*
వరంగల్ రైతుసంఘం కార్యాలయంలో నవంబర్ 25 న జరిగిన పత్తి రైతుల రాష్ట్ర సదస్సులో రాష్ట్ర కో కన్వీనర్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన చెల్పూరి రాము ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడ్ శోభన్ పాల్గొని ప్రసంగించారు అనంతరం చెల్పూరి రాము మాట్లాడుతూ నా పైన నమ్మకం పెట్టుకొని నన్ను పత్తి రైతుల రాష్ట్ర కోకన్వీనర్ గా ఎన్నుకున్నందుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కి మూడు శోభన్ కి వివిధ జిల్లాల పత్తి రైతులకు ప్రతినిధులకు ప్రత్యేక విప్లవ వందనాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై పత్తి క్వింటాల్ కు రూ.7,521/- కనీస మద్దతు ధరను అమలు చేయాలని, ఎన్నికల బోనస్ హామి పత్తి క్వింటాల్‌కు రూ.475 చెల్లించాలని, తేమ శాతం పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు, వానాకాలం, యాసంగి పంటలకు రైతు భరోసా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షల రైతు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేసేంతవరకు రైతుల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలపై రైతాంగ పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు .