బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చెప్యాల వెంకట్ రెడ్డి

బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చెప్యాల వెంకట్ రెడ్డి

గజ్వేల్ జనవరి 10 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా గజ్వేల్ పట్టణ చెప్యాల వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నేతలు అందరితో కలిసి, సమన్వయంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, మెదక్ పార్లమెంట్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నాయకుల అందరికీ మరియు గజ్వేల్ పట్టణ బిజెపి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి స్వామి, వెంకటేశ్ చారి, వెన్నెల స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now