Site icon PRASHNA AYUDHAM

గజ్వేల్ పట్టణం నుంచి బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చెప్యాల వెంకట్ రెడ్డి..

IMG 20250110 WA0702

గజ్వేల్ పట్టణం నుంచి బిజెపి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చెప్యాల వెంకట్ రెడ్డి..

గజ్వేల్ జనవరి 10 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని చెప్యాల వెంకట్ రెడ్డి సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. చెప్యాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో బీజేపీని బలోపేతం చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నేతలు అందరితో కలిసి, సమన్వయంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మరియు మెదక్ పార్లమెంట్ ఎంపీ ప్రియతమ నాయకులు మాధవనేని రఘునందన్ రావు గారికి, సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు కి గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ కి గజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నాయకుల అందరికీ మరియు గజ్వేల్ పట్టణ బిజెపి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version