Site icon PRASHNA AYUDHAM

రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి  చేర్యాల సీఐ ఎల్. శ్రీను

రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి

 చేర్యాల సీఐ ఎల్. శ్రీను

రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని చేర్యాల సీఐ ఎల్ శ్రీను సూచించారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ శివారు జనగామ ఎక్స్ రోడ్ ప్రగతి స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ప్రదేశాన్ని గురువారం చేర్యాల సీఐ శ్రీను, ఎస్ఐ నరేష్, ఆర్ అండ్ బి అధికారులు సందర్శించారు. రోడ్డు ప్రమాదాలని వారణ చర్యల గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమీక్షించారు. మానవ తప్పిదం అధిక వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ.. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, హజ్డాడ్ మార్కర్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్,వేగ నియంత్రణ బోర్డు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Exit mobile version