Site icon PRASHNA AYUDHAM

బస్ షెల్టర్ దాత బామండ్లపల్లి శివన్న ప్రారంభించిన ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టి పెళ్లి శివాజీ

IMG 20241226 121904

*బస్ షెల్టర్ కోసం ముందుకొచ్చి నిర్మించిన దాత బామండ్ల పల్లి శివన్న*
*ప్రారంభించిన ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపెల్లి శివాజీ*

*జమ్మికుంట/ఇల్లందకుంట డిసెంబర్ 26 ప్రశ్న ఆయుధం:*

గురువారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇల్లందకుంట మండలాలలో కనీసం కూర్చోవడానికి బెంచీలు లేక బస్టాండ్ షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను చూసి తాత్కాలిక బస్ షెల్టర్ నిర్మించాలని ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశంపూర్ గ్రామానికి చెందిన బామండ్ల పల్లి శివన్న తన తండ్రి అయినటువంటి భామండ్లపల్లి మహాలింగం జ్ఞాపకార్థం సుమారు 35 వేల రూపాయలు వేచించి ఒక్కొక్కటి నాలుగు బస్టాండ్ షెల్టర్ లను జమ్మికుంట మండలంలో పాపయ్యపల్లి లోఒకటి మడిపల్లి గ్రామాలలో ఒకటి, రెండు బస్ షెల్టర్లు ఇల్లందకుంట మండలంలోని మండల కేంద్రంలో గల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒకటి శ్రీరాములపల్లి గ్రామంలో ఒకటి, రెండు బస్ షెల్టర్లు నిర్మాణం నాలుగు బస్ షెల్టర్ల మొత్తం లక్ష్య 50 వేల రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు గురువారం రోజున ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపెళ్లి శివాజీ రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ కరీంనగర్ జిల్లా ఆరే సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇంగిలే రామారావు తో కలిసి ప్రారంభించారు మండల కేంద్రానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు శెట్టిపల్లి శివాజీ మొదట ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ వరంగల్ జిల్లా ముఖ్య సలహాదారుడు కుడ్లే మనోహర్ రావు లతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనం చేసి శేష వస్త్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు రాష్ట్ర నాయకులు అదర్ సండే నాగేశ్వరరావు మండల అధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస్ ఆరే సంక్షేమ సంఘం నాయకులు వీరన్న లక్ష్మయ్య రాజు వెంకటేశ్వర్లు రాజు ప్రభాకర్ సంతాజీ సుధాకర్ రామారావు రవి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version