చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్.చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది.. గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో.. ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే, గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది.. మాకు న్యాయం చేసే అంత వరకు మేము వినేదిలేదంటూ.. మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది…
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పై కోడిగుడ్లు,టమాటలతో దాడి..
by admin admin
Published On: August 28, 2024 10:45 pm