Site icon PRASHNA AYUDHAM

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి

*ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెనింగ్ లను జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, ఆందోల్ ఆర్డీవో కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, అందోల్ ఆర్డిఓ కార్యాలయాలలో నూతన ఓటరు పరిశీలించారు. ఆన్లైన్ వేగవంతంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సంగారెడ్డి తార డిగ్రీ కళాశాల లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బిఎల్ఓ లతో మాట్లాడి ఫారం 6, 7, 8 ఆన్లైన్, సాధారణ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లాలో ఎస్ ఎస్ ఆర్ 2025 ఓటరు నమోదు వివరాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు వివరాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లాలోని ఆర్డీవోలు పాల్గొన్నారు.

Exit mobile version