నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతక్క..

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి వెళ్లి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు పల్లి శ్రీకాంత్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.