ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 12
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియతో సమావేశం జరిగింది.ఈనెల 12 నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంపీటీసీ,జడ్పిటిసి రిజర్వేషన్ తొలగించి జనరల్ లో కలిపి లక్షలాదిమంది ఎస్సీ కులాలకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం హాయంలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల సాగు భూములకు గతంలో మ్యానువల్ మహాణిల ద్వారా వంట రుణాలు పొందినారు. అటువంటి అవకాశం కోల్పోయినందున ఏజెన్సీ ప్రాంత ఎస్సీ రైతులకు రైతు బంధు రైతు బీమా రైతు రుణాలు అమలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధి సంక్షోభంలో పడినందున కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎస్సీ కులాల అభివృద్ధిపై అసెంబ్లీలో సమీక్ష జరిపి ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ సీనియర్ నాయకులు నర్సింగ్ మోరే, అరికెళ్ల అశోక్, మోతే బారికరావు, జిల్లపల్లి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.