ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయిమేoట్ ఇవ్వండి

ఎన్నికల ముందు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి

2014 నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక ఎన్నికలో జెడ్పిటిసి, ఎంపీటీసీ అమలు చేయాలని డిమాండ్
లక్షలాదిమంది ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షోభంలో పడింది ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరారు.
షెడ్యూల్డ్ హక్కుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయిమేoట్ కనిపించాలని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుని హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి తన నివాసం హైదరాబాద్ లో బొమ్మెర శ్రీనివాస్ బృందం కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానికజడ్పిటిసి,ఎంపీటీసీ
రిజర్వేషన్ జనరల్ లో కలపడం వల్ల ఏజెన్సీ ప్రాంతలక్షలాదిమంది ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తీరని అన్యాయంజరిగిందని విన్నవించారు.స్పందించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు.కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో కృషి చేసినామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులను కలిసిన సరైన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు ఇచ్చిన హామీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోని 2014 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆధారంగా అమలు చేయాలని కోరారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధి పై వివక్షత అణచివేత జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్య పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment