మూసాపేట మరియు బేగంపేటలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చెసిన కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రభుత్వానికి ప్రజలకు పార్టీ కార్యకర్తలు అనుసంధాన కర్తలుగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడిన హామీలను అమలు చేసిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎస్సీ కులగణన 6 గ్యారంటీల అమలును సమర్థంగా అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఆదివారం నియోజకవర్గ పరిధిలోని మూసాపేట మరియు బేగంపేటలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బoడి రమేష్, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రమేష్ మాట్లాడారు 30 ఏళ్ల పోరాటానికి ఫలితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగిందన్నారు.పాలనలో దేశానికి తెలంగాణ ఆదర్శవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి జిందాబాద్ బండి రమేష్ నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీనికంటే ముందు మూసాపేట్ లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిదేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో ధోబి ఘాట్ వద్ద జరిగిన బోనాలకు ఓకే అదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోకావునకూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేశారు.