Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

IMG 20250910 WA0434

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

 

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 10

 

 

కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటన (15వ తేదీ)కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్, బుధవారం రోజున పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, VIP రాకపోకల మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ– ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, VIP రాకపోకలు, భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, దిశా సూచికలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, రామన్, దేవునిపల్లి ఎస్సైతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version