ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అబద్దాల కోరు

*చెప్పేది ఒకటి చేసేది ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అబద్దాల కోరు*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు*

*జమ్మికుంట జనవరి 17 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఓ అబద్ధాల కోరు సీఎం ఆని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు ఆరోపించారు.ఆరు గ్యారెంటీల పేరిట 420 హామీలు ఇచ్చి తెలంగాణలో ఆదికారింలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని సంపత్ రావు తీవ్రంగా దుయ్యబట్టాడు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు అనేక రకాల అమలు కానీ హామీలు ఇచ్చి వాటి అమలు బాధ్యత తనదేనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు ఏ రకంగా గ్యారంటీ ఇస్తాడని సంపత్ రావు ప్రశ్నించాడు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ఢిల్లీ ప్రజలకు తెలుసని, రేవంత్ రెడ్డి హామీలను నమ్మే పరిస్థితిలో ఢిల్లీ ప్రజలు లేరని గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి అండగా నిలబడి, రాజకీయ కక్షలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి,(కాంగ్రెస్ పార్టీ) నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి లిక్కర్ స్కాం సూత్రధారి కేజ్రీవాల్ అని చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశాడు. ఇప్పటికైనా కేజ్రీవాల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం తెలుసుకున్నందుకు సంతోషమన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది అనడానికి నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడిన మాటలు నిదర్శనమని ఆయన ఆరోపించారు. మొన్న జరిగిన మహారాష్ట్ర,హరియన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారని, కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారని సంపత్ రావు గుర్తు చేశాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఢిల్లీలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని సంపత్ రావు జోస్యం చెప్పారు.

Join WhatsApp

Join Now