కోటగిరిలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం.
కోటగిరి, ఫిబ్రవరి 6
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉమ్మడి మండలాల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్న సాయన్న ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ధర్నా కార్యక్రమం చేపడుతూ నిరాసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిర్జాపూర్ చిన్న సాయన్న మాజీ ఎంపీటీసీ సోన్ కాంబ్లే సాయిలు మాట్లాడుతూ….. మాలలపై చిన్నచూపు చూసిన సీఎం రేవంత్ రెడ్డి పై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.దేశంలో ని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకువచ్చి ముందుగానే వర్గీకరణ చేయడం చాలా సిగ్గుచేటు అన్నారు. మందకృష్ణ మాదిగ మాటలు నమ్మి ఎస్సీ వర్గీకరణ పై ఆమోదం చేయడం పై మాల మహానాడు నాయకులు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేయడం సబబు కాదన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డౌన్ డౌన్, డౌన్ డౌన్, అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల మాల మహానాడు ఉపాధ్యక్షులు కాలే సాయిలు పోతంగల్ మండల గ్రామ అధ్యక్షుడు వీరేందర్ ఎత్తోండ మాల మహానాడు గ్రామ అధ్యక్షుడు కోర్బా సతీష్,రాజ్ కుమార్ తుకారం కోటగిరి మోరే జీవన్ జంగం సాయిలు, పాల గంగారం, నాగేష్,వినోద్, నిమ్మల రమేష్ సత్యం టాక్లి సత్యపాల్ వివిధ గ్రామాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాల మహానాడు నాయకులు తదితరులు పాలుగోన్నారు.