ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం

పేదలకు ఆర్థిక భరోసా
ముఖ్యమంత్రి సహాయ నిధి

మాజీ మార్కెయ్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

సిద్దిపేట ఆగస్టు 4 ( ప్రశ్న ఆయుధం ) :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన పలువురికి మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ శాసన సభ్యులు కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో గతంలో అనారోగ్యంతో బాధపడి ఉండగా వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులైన ఎర్ర బానుప్రసాద్ 46500,దంచెట్టి అనూష్ 28000 బోగరి మారుతి 39000, శనిగారి శివరాజయ్య 15000, పి శ్రీనివాస్ 39000, పాల బాల్ నర్సవ్వ 7000, బోయిని లావణ్య 18000, అడేపు శ్రీనిజ 45000, రామచంద్రం 25000, ఐ అశోక్ 39000, వీరందరికి కలిసి మొత్తం 301500 రూపాయలు వారికి ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అంద చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదాని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేసిన రుణమాఫీ విషయంలో గందరగోళ పరిస్థితి ఉందని వాటిని నివృత్తి చేసి ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం రైతు బంధు తక్షణమే రైతుల ఖాతాలలో జామచేయాలని, వానాకాలం వచ్చింది, కానీ రైతులకు పంట పెట్టుబడి సహాయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాన చినుకు పడితే రైతు బంధు పైసలు పడేవని
ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఇది ప్రజా పాలన కాదు అని, ప్రజా వ్యతిరేక పాలన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగిన రైతులకు 24 గంటల కరంట్ అందించలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని వారు తెలిపారు.నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతు గా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా కొనసాగయని గుర్తు చేశారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయ మని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము డిమాండ్ చేయడం తప్పా..? అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను డిసెంబర్ దాటిన ఇంతవరకు వాటి ఊసే లేదని అన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ సీఎం అవుతారు, కే సి ఆర్ తెలంగాణ కు శ్రీరామ రక్ష తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబందు మాజీ మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ,మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, సత్యగౌడ్, బీ. స్వామి, టి. అశోక్, ముత్యం గౌడ్, ఎస్, బాలయ్య, రామగౌడ్, బుచ్చిరెడ్డి, రాజ్ కుమార్,రాంరెడ్డి, అమరెందర్ రెడ్డి, డప్పు ప్రశాంత్, కరుణాకర్, గోపాల్ రెడ్డి, ప్రశాంత్, భూపతి, రాములు, ఎం.నరేష్, నాంపల్లి, వెంకట్ గౌడ్, సత్యం, రాజు, లబ్ధిదారుల కుటుంబాలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now