బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడంపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎంఎల్ఏ జగదీశ్వర్ రెడ్డి ని ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బి ఆర్ ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్, ఆదేశానుసారం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అద్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు. ఈ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పిప్పిరి అంజనేయులు, జూకంటి ప్రభాకర్ రెడ్డి, గెరిగంటి లక్ష్మినారాయణ, కుంబాల రవి, బల్వంత్ రావు, భాను ప్రసాద్, మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.