*ముఖ్య అధికారుల ముగ్గురు ఒకే రోజు పదవీ బాధ్యతల స్వీకరణ*
*జమ్మికుంట /హుజురాబాద్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఒకే రోజు ముగ్గురు ముఖ్య అధికారులు పదవీ బాధ్యతలు స్వీకరించడం యాదృచ్ఛికంగా జరగడం విశేషం మండల స్థాయి అధికారులే గాక కీలకమైన శాఖలకు వీరు ముగ్గురు అధికారులుగా వ్యవహరించడం గమనార్హం ఇందులో ఒకరు తాసిల్దార్ మరొకరు టౌన్ సీఐ ఇంకొకరు సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు స్వీకరించారు
*హుజురాబాద్ తాసిల్దారుగా కనకయ్య*
హుజురాబాద్ మండల తాసిల్దార్ గా కే. కనకయ్య శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఇంతకాలం హుజురాబాద్ తాసిల్దార్ గా ఉన్న కే. విజయ్ కుమార్ తిమ్మాపూర్ కు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న కనకయ్య హుజురాబాద్ బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు
*హుజురాబాద్ పట్టణ సిఐగా తిరుమల్*
హుజురాబాద్ టౌన్ సిఐగా జి తిరుమల్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఇంతకాలం హుజురాబాద్ టౌన్ సిఐగా పనిచేసిన బొల్లం రమేష్ కరీంనగర్ సిసిఎస్ కు బదిలీ కాగా కరీంనగర్ సిఎస్ బి త్రీ లో పనిచేస్తున్న తిరుమల్ హుజురాబాద్ కు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు
*హుజురాబాద్ సబ్ రిజిస్టర్ గా ఇంత్యాజుద్దీన్*
హుజురాబాద్ సబ్ రిజిస్టర్ గా ఎండీ ఇంతియాజుద్దీన్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఇంతకాలం హుజురాబాద్ లో పని చేసిన ఎండీ మక్సూద్ అలీ అదిలాబాద్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో ఇంత్యజుద్దీన్ చార్జ్ తీసుకున్నారు