నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రబీ 2022-23 టెండర్ ప్యాడి లాట్స్ 1, 2 మరియు 12లకు సంబంధించి చీఫ్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి శశిధర్ రాజ్ రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టెండర్ ప్యాడి పేమెంట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేయాలని ఆయన సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఓ ఎస్ డి , శ్రీధర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్, ఏ సి ఎస్ ఓ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
సమీక్ష అనంతరం, నిజామాబాద్ జిల్లా లోని ప్రధాన రైస్ మిల్లు పరిశ్రమలు, తిరుమల శ్రీనివాస ఇండస్ట్రీస్ (ఖానాపూర్), సిద్దమ్మ రైస్ ఇండస్ట్రీస్ (కలూర్), సిద్ది రామేశ్వరా ఇండస్ట్రీస్ (కలూర్), లక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ (శ్రీనగర్) మరియు శ్రీ లక్ష్మీ నరసింహ నారాయణి ఆగ్రో ఇండస్ట్రీస్ (అశోక్ ఫారం) లలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల ద్వారా ప్యాడి ప్రాసెసింగ్, నిర్వహణ, ఇతర వివరాలను సమీక్షించారు.