యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 05

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట మండలం అలంకృత రిసార్ట్‌లో బోధి స్కూల్ ఆఫ్ యోగ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యోగ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది యోగా ప్రతిభావంతులకు ఆయన అవార్డులు అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, “బిజీగా ఉండే ఆధునిక జీవితంలో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎంతో అవసరం” అని చెప్పారు. విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు, ఉన్నత స్థాయి అధికారులు సైతం యోగా అభ్యాసం చేసి ఉన్నతులు అవుతున్నారని పేర్కొన్నారు.

యోగా అనేది ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమని, ప్రధానమంత్రి మోడీ దాని ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. కులమతాలకు అతీతంగా యోగాను విస్తృతంగా ప్రచారం చేసి మానవాళికి మేలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా రష్మిక, ఆధ్యాత్మికవేత్తలు గౌరీ రొక్కం, సత్యవాణి, బోధి యోగ స్కూల్ వ్యవస్థాపకుడు అశోక్, సలహాదారు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment