*బాల వికాస సేవలు అభినందనీయం..*.
*బాలక్క ఆశయసాధనలో అందరం కలిసి పని చేద్దాం*
*
*మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి*.
* బాలల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా*…
*కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్*
*జమ్మికుంట ఫిబ్రవరి 2 ప్రశ్న ఆయుధం*
బాలక్క ఆశయ సాధనలో కలిసి పయనిద్దామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో వికాస(అనాధ) బాలల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి బాల వికాస పిల్లలకు తినిపించారు బాలవికాస పిల్లలు తమ అనుభవాలను, తమ తల్లిదండ్రులు క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నామని బాల వికాస పిల్లలు వారి అనుభవాలు తెలియజేశారు జమ్మికుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వికాస బాలల పుట్టినరోజు వేడుకలకు ప్రణవ్ హాజరయ్యారు. ఆయనకు బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు కోలాట నృత్యాలతో పూలు చల్లుతూ బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని వికాస బాలల పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని కన్నతల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదనే నానుడిని నిజం చేస్తూ బాలక్క విదేశాల్లో ఉండి ఇక్కడ చేస్తున్న సమాజసేవలో ప్రతి ఒక్కరం పాలు పంచుకోనీ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు కాలుష్యం పెరిగిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దానిని నివారించడానికి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని ప్లాస్టిక్ నిషేధించాలని బాల వికాస పేరుతో బట్ట బ్యాగులు తయారు చేయించి అందరికీ అందజేయాలని వికాస బాలలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వికాస బాలలకు అందరూ తమ వంతు సహాయ సహకారాలు ప్రేమ అభిమానాలు అందించాలని పేర్కొన్నారు వికాస బాలల పుట్టినరోజుకు తమ తమ పనులు విడిచిపెట్టుకొని ఇంత పెద్ద మొత్తంలో హాజరైన బాల వికాస తల్లులకు అభినందనలు తెలియజేశారు. కేక్ కట్ చేసి వికాస పిల్లలకు తినిపించి వారి ఉదార స్వభావాన్ని ప్రేమను చాటుకున్నారు. బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ 8 రాష్ట్రాలలో 7000 మంది సభ్యులతో విస్తరించి సేవలందించడం గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సారంగపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్లు ఎగ్గేటి సదానందం, దీక్షిత్ గౌడ్, నాయినేని రాజేశ్వరరావు ,తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి రెడ్డి, ఎండి రషీద్, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన బాలవికాస కోఆర్డినేటర్లు, అమూల్య ,బాలవికాస సభ్యులు వికాస బాలలు తదితరులు పాల్గొన్నారు.