గుండెపోటుతో చిన్నారి మృతి

*గుండెపోటుతో చిన్నారి మృతి*

 

కరీంనగర్ జిల్లా: అక్టోబర్16

 

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు (5) గుండెపోటుతో మరణించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది, 

 

మంగళవారం ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకున్న తర్వాత కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. 

 

అక్కడ బాలికను పరీక్షిం చిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన బాలికను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారి మృతి చెందింది. 

 

కాగా, చిన్నారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని వైద్యులు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 

 

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని తెలియ డంతో జమ్మికుంటలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

Join WhatsApp

Join Now