Site icon PRASHNA AYUDHAM

వాహనం టైరు కింద పడి చిన్నారి మృతి 

వాహనం
Headlines in Telugu:
  1. “సుల్తానాబాద్: వాహనం టైరు కింద పడి చిన్నారి మృతి”
  2. “సుల్తానాబాద్: ట్రాలీ టైరు కింద పడి ఏడాది చిన్నారి రఫీనా మృతి”
  3. “ప్రమాదంలో చిన్నారి మృతి: సుల్తానాబాద్‌లో విషాద సంఘటన”
  4. “సుల్తానాబాద్ గ్రామంలో వాహనం ప్రమాదం, చిన్నారి ప్రాణాలు కోల్పోయింది”
  5. “కదంబాపూర్ గ్రామంలో ట్రాలీ కింద పడి చిన్నారి మృతి: విషాదం”

 సుల్తానాబాద్ :

ఓ వాహనం ట్రాలీ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. వాహనం టైరు కింద పడి చిన్నారి మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో రోడ్డుపై ఆడుతున్న పాప క్షణాల్లో అనంత లోకాలకు వెళ్లిపోయింది. రోజు మాదిరిగానే ఉదయం లేచిన చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రక్కనే ఉన్న ట్రాలీని రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు దాని టైర్ల కింద పడి రఫీనా అనే ఏడాది పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం లేచి ఆడుకుంటున్న పాప ఒక్కసారిగా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టకూటి కోసం పాప తండ్రి రాజ్ మహ్మద్ దుబాయిలో జీవనం కొనసాగిస్తుండగా, రోజులాగే తల్లి ఖరీదా ఇంట్లో పనిచేసుకుంటుంది. రఫీనా ఇంటిముందు ఆడుతుండగా, ఇంటి దగ్గరలో ఉండే షకీల్ అనే వ్యక్తి తన వాహనం ట్రాలీ వెనుకకు తీసే క్రమంలో ఆడుకుంటున్న పాపను గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version