*బడి బయట పిల్లలు బడిలో ఉండాలి*
బయట పిల్లలు బడిలో ఉండాలని ఎంపీ పి ఎస్ తలమడ్ల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ గౌడ్ అన్నారు. బడి బయటి పిల్లల సర్వే లొ భాగంగా ఎంపీపీ ఎస్ తలమడ్ల ఉపాధ్యాయులు పౌల్ట్రీ ఫారం ను సందర్శించి బడికి దూరమైన 20 మంది విద్యార్థులను గుర్తించి వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎంపీపీస్ తలమడ్ల పాఠశాలలో చేర్పించడం జరిగింది.విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి సహకరించిన పౌల్ట్రీ ఫారం డిజిఎం సుధాకర్ రెడ్డి , మేనేజర్ ఓబులేషకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమం లో పాఠశాల HM రమేష్ కుమార్ గౌడ్ ఉపాద్యాయుడు దుర్గాప్రసాద్ CRP లు శ్రీ లింగం మరియు సాయిరెడ్డి పాల్గొన్నారు .