పిల్లలు సృజనాత్మక శక్తిగా ఎదగాలి ఎమ్మెల్యే కూనoనేనీ

పిల్లలు సృజనాత్మక శక్తిగా ఎదగాలి ఎమ్మెల్యే కూనoనేనీ
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
గ్రంధాలయాల విజ్ఞాన బాండాగారాలు
వారోత్సవాల పేరిట పిల్లల సృజనాత్మక శక్తికి వెలికితీయడం అభినందనీయం అన్నారు.
బాల్యం కళ్లముందు కదలాడింది మంచిగా చదువుకోండి, ఉన్నతస్థితికి ఎదగండి అన్నారు.
త్వరలో నూతన గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించుకుందా
సమస్యల పరిష్కారానికి కృషి
ఎంఎల్ఎ కూనంనేని కొత్తగూడెం : గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారలని, ప్రత్యక్ష దేవాలయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. గ్రంధాలయ వారోత్సవల ముంగింపు సందర్భంగా కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కూనంనేని మాట్లాడుతూ 57వ జాతీయగ్రంధాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులకు పలు రకాల పోటీలు నిర్వహించారని, ఆ పోటీల్లో పిల్లలు సంతోషంతో పాల్గొన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
పిల్లలో దాగుతున్న సృజనాత్మక శక్తియుక్తులను వెలికి తీసేందుకు ఇలాంటి వేధికలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని, విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా వారు ఉత్సాహంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ఆటపాటలతో హాయిగా సాగిపోయే బాల్య మస్తిష్కంలో ఎన్నో ఆలోచలు దాగుంటాయని, వాటిని మెరుగుపరుచుకునేందుకు వేధికలు దొరికితే అంతకు మించిన ఆనందం ఉండదన్నారు. పిల్లలు కూడా నిత్యం వుస్తక పఠనంతో పాటు పత్రికలను చదవడం అలవర్చుకోవాలని, దేశంలో, రాష్ట్రంలో, మన చుట్టు ప్రక్కల ఏమి జరుగుతుందో తెలుసుకోవడం వల్ల మరింత ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులు గ్రంధాలయాలకు వచ్చి మంచిమంచి పుస్తకాలు చదువుకుని తెలివితేటలు పెంచుకోవాలని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, బాల్యంలో చక్కగా చదువుకుని పైకి రావాలని, మనిషి జీవన శైలిని మార్చగల శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉందన్నారు. కష్టపడి చదువుకున్న వాళ్లు నేడు ఎంతో సంతోష కరమైన జీవితాలను గడువుతున్నారని, వారి బ్రతుకులు బంగారు మయంగా ఉన్నాయన్నారు. ఇక్కడికి వచ్చిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, నా బాల్య జీవితం ఒక్క సారిగా కళ్లముందు కదలాడిందన్నారు. నూతనంగా నిర్మించుకున్న గ్రంధాలయాన్ని త్వరలో సరి కొత్త హంగులతో ప్రారంభించుకుని పాఠకులకు అందుబాటులోనికి తీసుకొస్తామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ గ్రంధాలయంపై ఆధారపడి చదివిన ఎందరో అభ్యర్థులు ఉద్యోగాలు సాధించినట్లు తెలిసిందని
అనునిత్యం అభ్యర్ధులకు అందుబాటులో ఉంటూ వారు చదువుకుని ఉద్యోగాలు సాధించేందుకు సిబ్బంది కృషి చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వారం రోజుల పాటు నిర్వహించిన పలు సాంస్కృతి, వైజ్ఞానికి కార్యక్రమాల్లో ప్రతిభను కనబరిచిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కావు సీతామహాలక్ష్మీ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా,
గ్రంథాలయ కార్యదర్శి వి అర్జున్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్కే దస్తగిరి, వివేకవర్ధిని ప్రిన్సిపాల్ మహేష్, హెచ్ఎం నీరజ, గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్, గ్రంథ పాలకులు మణి మృదుల, మధుబాబు,రుక్మిణి గీత, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment