బాలల హక్కులపై అవగాహన సదస్సు

*బాలల హక్కులపై అవగాహన సదస్సు*

*బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ ఎం రమేష్*

 

*ఇల్లందకుంట అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం)*

 

బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాలల హక్కులపై జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ రమేష్ మాట్లాడుతూ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు బాల్య వివాహాలు బాల కార్మికులు బాలల బిక్షాటన పిల్లల డ్రగ్స్ అలవాట్లు మొదలయిన సమస్యల పైన విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు గ్రామాలలో బాల్య వివాహాలను ఎవరైనా ప్రోత్సహించినట్లయితే కఠిన శిక్షలు ఉంటాయని దానికి ఎవరు కూడా ఎంకరేజ్ చేయవద్దని దాని వల్ల జరిగే నష్టాలను పేర్కొన్నారు బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని బాలలు బిక్షాటన వారిని ప్రోత్సహించడం నేరమని పిల్లలు డ్రగ్స్ అలవాటు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని డ్రగ్స్ అమ్మే వారి పైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎవరైనా డ్రగ్స్ అమ్మినట్లు దృష్టికి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలుపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now