*ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు*
*వెలువెత్తిన అభిమానం*
*భారీగా తరలివచ్చిన జనసైనికులు*
*మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా మంగళగిరి ఆటోనగర్ లోని APMSIDC కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు*
*చిల్లపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద నుంచి పాదయాత్ర గా అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు*
*అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు*
*అంబేద్కర్ సెంటర్ నుంచి మంగళగిరి లోని ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు*
*ఏపి మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయం లో వేడిపండితుల ఆశీర్వచనాల నడుమ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు*
*తమ అభిమాన నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపేందుకు బీసీ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నేతలు, పలువురు రాజకీయ నేతలతో పాటు చిల్లపల్లి అభిమానులు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలివచ్చారు*
*ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ*
*నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మరియు మంత్రివర్యులు సత్యకుమార్, లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు*
*ప్రభుత్వ ఆస్పత్రి లో కార్పొరేట్ వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు*
*మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరికి త్వరలోనే 100 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు*
*ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ పదవి మరింత అదృష్టంగా బావిస్తున్నాని తెలియజేశారు*
*వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు*