Site icon PRASHNA AYUDHAM

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిలుముల గోపి కిరణ్

IMG 20250830 WA00131

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిలుముల గోపి కిరణ్

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల

కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి(ఎస్ సి హెచ్ పి ఎస్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా చిలుముల గోపి కిరణ్ ని ఉపాధ్యక్షులుగా కె ఇందు కుమారి,జిల్లా ప్రధాన, కార్యదర్శిగా బోగా మల్లికార్జున్, జిల్లా కార్యదర్శిగా కనుకుంట్ల రాకేష్,జిల్లా సలహాదారుడుగా మారెళ్లి విజయ్ కుమార్, పినపాక డివిజన్ కన్వీనర్ గా కాసిపెట్టి కృష్ణ ,ఇల్లందు కన్వీనర్ గా మేకల శంకరులను ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాసు,తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ తదితరు

లు పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో బొమ్మర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం ఏజెన్సీ ఎస్సీ కులాల రిజర్వేషన్ల పూర్వం లాగానే కొనసాగించాలని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల జనాభా పెరిగినందున ఎస్సీరిజర్వేషన్ 20% పెంచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా సెప్టెంబర్ నెల 4-2025 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుండి జరగబోవు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ పునరుద్దించాలని రాజ్యాంగ

పరమైన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ

కార్యక్రమంలో సామాజిక వర్గ మాజీ ఎంపీటీసీలు,జడ్పిటిసిలు ముఖ్య నాయకులు పార్టీలకు సంఘాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Exit mobile version