అన్నారంలో బోనాల ఉత్సవాలకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని గ్రామ యువకులు ఆహ్వానించారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుపాకుల రాజు, నరహరి, శేఖర్ గౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్ జీవ, సత్యనారాయణ, శ్రీధర్, యాదగిరి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now