బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్):గుమ్మడిదల మండలం అనంతారం, దోమడుగు, అన్నారం గ్రామాలలో శ్రీ పోచమ్మ తల్లి బోనాలు, ఫలహారం బండి ఊరేగింపు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, సిజిఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి, యాదిరెడ్డి, గోపాల్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, ఆంజనేయులు, భాస్కర్ గౌడ్, లక్ష్మణ్, ఈశ్వరయ్య, సాయి గౌడ్, కొమ్ము శ్రీనివాస్, శ్రీకాంత్, మల్లేష్, బీరప్ప, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now