బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన తొలిచుక్క నాగరాజు, చిత్తరి మహేష్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మొగులయ్య, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణ, ఆంజనేయులు, బాల్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment