సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కిష్టయ్యపల్లిలో గాలి పోచమ్మ తల్లి జాతరను ఆలయ నిర్వహకులు, గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారిని మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాశంచారి, ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు బాసెట్టిగారి రాజు, ఆకుల భార్గవ్, ప్రభాకర్ రెడ్డి, నాయకులు గణేష్, అమ్మగారి సదానంద రెడ్డి, మొగులయ్య, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఆంజనేయులు యాదవ్, మల్లేష్ యాదవ్, మల్లేష్, నల్తూరి యాదగిరి, వెంకటేష్ యాదవ్, ఆలయ నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు.
గాలి పోచమ్మ తల్లిని దర్శించుకున్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Published On: March 2, 2025 7:20 pm
